హృద్రోగులకు కేంద్రం అందిస్తున్న శుభవార్త
- October 02, 2017
న్యూఢిల్లీ : హృద్రోగులకు కేంద్రం శుభవార్త అందించింది. కరోనరీ స్టెంట్ల కొరతతో గుండెజబ్బుతో బాధపడుతున్న రోగులు అవస్థలు పడుతున్న నేపథ్యంలో కేంద్రం కొరడా ఝళిపించింది. దేశంలోని స్టెంట్ల కొరత లేకుండా నిరాటంకంగా రోగులకు అందించాలని స్టెంట్ల తయారీదారులు, దిగుమతిదారులకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో స్టెంట్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో జాతీయ ఔషధాల ధర నిర్ణాయక మండలి, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సంస్థలు సంచలన ఆదేశాలు జారీ చేశాయి. స్టెంట్ల కొరత లేకుండా నిరంతరంగా సరఫరా చేసి స్టెంట్ల పంపిణీపై తమకు వారం వారం నివేదిక సమర్పించాలని కేంద్ర సంస్థలు ఆదేశించాయి. గుండెజబ్బుతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరిన రోగులకు ఎలాంటి కొరత లేకుండా స్టెంట్లను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర సంస్థలు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







