ట్రక్ - స్కూల్ బస్ ఢీ: నలుగురు విద్యార్థులకు గాయాలు
- October 02, 2017
ఓ ట్రక్, స్కూల్ బస్సుని ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. దుబాయ్ ఎతిహాద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులను స్కూల్ బస్, స్కూల్‌కి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాల మధ్యా తగినంత గ్యాప్ పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయ్ చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు చిన్నపాటి గాయాలు కాగా, మరో విద్యార్థికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. చిన్నపాటి గాయాలైన విద్యార్థులకు ఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు ఇతర వాహనాలతో తగినంత గ్యాప్ మెయిన్‌టెయిన్ చేయాలని బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









