బంగారం ధర స్వల్పంగా తగ్గింది

- November 02, 2015 , by Maagulf
బంగారం ధర స్వల్పంగా తగ్గింది

సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.10 తగ్గి రూ.26,810కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు కొనుగోళ్లు చేయకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.7శాతం తగ్గి 1,134.39 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.అలాగే వెండి ధర కూడా తగ్గింది. రూ.270 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.36,500కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో డిమాండు తగ్గిందని దీంతో ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com