నేడు లేబర్ సిటీని ఆవిష్కరించనున్న కతార్ అధినేత

- November 02, 2015 , by Maagulf
నేడు లేబర్ సిటీని ఆవిష్కరించనున్న కతార్ అధినేత

కతార్ ఇండస్ట్రియల్ ఏరియా యొక్క తూర్పుదిశలో ఒక కొత్త లేబర్ సిటీని కతార్ ప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా అల్-థాని నేడు ఆవిష్కరించనున్నారు. ఒక మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఈ పట్టణంలో, అత్యాధునిక రక్షణ మరియు భద్రతా ప్రమాణాలు గల 55 భవంతులు ఉన్నాయని, ఇది 1,00,000 మంది ప్రజలకు ఆశ్రయం కల్పించగలదని ప్రభుత్వ సమాచార కార్యాలయం తెలిపింది. ఇందులో సెక్యూరిటీ స్టేషన్ తో సహా, శ్రామికులకు ఒక వైద్య శాల, మసీదు, షాపింగ్ కాం ప్లెక్స్, సినిమా ధియేటర్, క్రికెట్ గ్రౌండ్ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయని;  ‘కతార్ నేషనల్ విజన్ 2030’ లో భాగంగా, సమాజం లోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని గురించి కతార్ యొక్క ప్రత్యేక శ్రద్దకు నిదర్శనమని అంతే కాకుండా ఈ నగరం, రానున్న మరిన్ని ప్రోజక్టులకు ఆదర్శ నమూనా అని కూడా తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com