టెడ్డీబేర్లను సేకరించిన ఓ బామ్మకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
- October 03, 2017
వెబ్ డెస్క్: ఒక్క టెడ్డీబేర్‌ను చూస్తేనే ముచ్చటేస్తుంది. అదే వేల టెడ్డీబేర్లు ఓకే చోట ఉంటే ఇక మన ఆనందానికి అవధులుండవు. 8,000కుపైగా టెడ్డీబేర్లను సేకరించిన ఓ బామ్మకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆ టెడ్డీబేర్ల విశేషమేంటో తెలుసుకుందామా?
అమెరికాలోని దక్షిణ డకోటాకు చెందిన 68ఏళ్ల బామ్మ జాకీ మిలే. ఆమెకు బాల్యంలో టెడ్డీబేర్లు అంటే ఏమిటో కూడా తెలియదట. 2000 సంవత్సరంలో ఓ ప్రత్యేక కార్యక్రమంలో గ్రాండ్మా జాకీ టెడ్డీబేర్‌ను గెలుపొందిన తర్వాత వీటి సేకరణను ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె వద్ద 8,026 టెడ్డీబేర్లు ఉన్నాయి. ఆమె ఇల్లంతా వీటితోనే నిండిపోయింది. దేశవిదేశాల్లోని రకరకాల టెడ్డీబేర్లన్నీ ఆమె వద్ద దర్శనమిస్తాయి. స్నేహితుల సూచన మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బృందానికి ఈ విషయం చేరవేసినట్లు ఆమె తెలిపారు.
జాకీ మిలే వద్ద ఉన్న టెడ్డీబేర్లన్నింటిలో అతి చిన్నదాని పొడవు 0.7 అంగుళాలు. అతిపెద్ద టెడ్డీబేర్ పొడవు 8 అడుగులు. అమెరికాతోపాటు ప్రపంచంలోని దాదాపు 29 దేశాల నుంచి విభిన్న రకాల టెడ్డీబేర్లను సేకరించినట్లు ఆమె తెలిపారు. వీటన్నిటినీ కలిపి దక్షిణ డకోటాలోని హిల్స్ సిటీలో టెడ్డీబేర్ టౌన్ పేరిట ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







