తెలుగు, కన్నడ భాషల్లో వస్తున్న 'రాజరథం'
- October 03, 2017
తన మొదటి సినిమాతోనే ఆస్కార్ అవార్డ్ నామినేషన్ వరకు వెళ్ళిన దర్శకుడు అనూప్ భండారి ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ అధినేత అజయ్‌రెడ్డి గొల్లపల్లి ,టాలెంటెడ్ డైరెక్టర్ భారతీయ సినిమా రంగానికి తన మొదటి చిత్రం 'రంగితరంగ' తో సుపరిచితమైన అనూప్ భండారిని 'రాజరథం' చిత్రంతో తెలుగులో పరిచయం చేస్తున్నారు. తెలంగాణలోని గొల్లపల్లి వాస్తవ్యుడైన అజయ్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ తెలుగు సినిమాలను ఇంటర్నేషనల్ మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అజయ్‌రెడ్డి తెలుగు, కన్నడ భాషల్లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. తెలుగులో 'రాజరథం' పేరుతో, కన్నడలో 'రాజరథ' పేరుతో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్ కామెడీతోపాటు అడ్వెంచర్స్ కూడా ఈ చిత్రంను తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







