లండన్‌లో విజయ్‌ మాల్యా అరెస్ట్‌, బెయిల్ పై విడుదల

- October 03, 2017 , by Maagulf
లండన్‌లో విజయ్‌ మాల్యా అరెస్ట్‌, బెయిల్ పై విడుదల

ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను లండన్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్‌ కేసులో మాల్యాను అరెస్టు చేసినట్లు సమాచారం. భారత్‌లోని బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లను ఎగవేసిన మాల్యా లండన్‌ వెళ్లి తలదాచుకుంటున్నాడు. అతడిని అప్పగించమని భారత ప్రభుత్వం బ్రిటన్‌ను కోరింది. అందుకు అంగీకరించిన బ్రిటన్‌ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్‌ కేసులో మాల్యాను లండన్‌ పోలీసులు అరెస్టు చేయడం ఇది రెండో సారి. అయితే ఆయనకు వెంటనే బెయిల్ రావడంతో విడుదలయ్యారు.

ఏప్రిల్‌ నెలలో మాల్యాను లండన్‌ పోలీసులు అరెస్టు చేశారు. కానీ కొద్ది సేపటికే అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి మార్చి 2016 నుంచి మాల్యా బ్రిటన్‌లో ఉంటున్నాడు. మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సిందిగా పలుమార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com