ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్ రోజుకు 4జీబీ డేటా
- October 03, 2017
టెలికాం మార్కెట్లో ఆఫర్ల యుద్ధం వెల్లువెత్తుతోంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు అదనపు డేటా ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్లతో హోరెత్తికిస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ రూ.999ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రీ పెయిడ్ రీఛార్జ్ ఆఫర్ 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉంటుందని, దీని కింద ఉచిత వాయిస్ కాల్స్‌ను కూడా అందించనున్నట్టు పేర్కొంది. అంటే 28 రోజుల్లో 122జీబీని ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు పొందుతారు.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి టెలికాం సెక్టార్లో ఈ డేటా యుద్ధం నెలకొంది. రిలయన్స్ జియో రూ.999 ప్లాన్‌కు పోటీగా ఎయిర్టెల్ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. జియో రూ.999 రీఛార్జ్ కింద 90జీబీ 4జీ డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. అయితే 90 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. ఒకవేళ 90జీబీ డేటా వాడకం అయినపోయిన తర్వాత స్పీడు 128 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఆ ప్లాన్ జియో ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. తాజాగా జియో తన రూ.149 ప్లాన్‌ను అప్డేట్ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







