బ్రెజిల్లో భారీ బ్యాంకు దోపిడి రూ.2,077 కోట్లు స్వాహా

- October 03, 2017 , by Maagulf
బ్రెజిల్లో భారీ బ్యాంకు దోపిడి రూ.2,077 కోట్లు స్వాహా

 బ్యాంక్‌ ఆఫ్‌ బ్రెజిల్‌లో భారీ బ్యాంకు దోపిడి జరిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన దుండగులు అర కిలోమీటరు మేర సొరంగ మార్గాన్ని తవ్వి బ్యాంకులోకి చొరబడ్డారు. 317మిలియన్‌ డాలర్లు ( రూ. 2077కోట్లు ) కొల్లగొట్టారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీస్‌ ఉన్నతాధికారులు..బ్యాంకు నుంచి 500 మీటర్ల దూరంలో భారీ సొరంగ మార్గాన్ని కనుగొన్నారు. సొరంగ మార్గంలో పెద్ద ఎత్తున ఆహారపదార్థాల నిల్వలు, శీతల పానీయాలు, ఇతర నిత్యా వసర సరుకులను గుర్తించారు. సొరంగమార్గాన్ని తవ్విన దుండగులు ఈ నిల్వలు సమకూర్చుకున్నట్టు గుర్తించారు. ఈకేసులో 16మంది నింది తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నాలుగు నెలల పాటు సొరంగాన్ని తవ్వినట్టు ప్రాథమిక విచారణలో నిందితులు అంగీకరించారు. ప్రపంచంలో జరిగిన చోరీల్లో ఇదే అతిపెద్దదని పోలీస్‌ అధికారి లోప్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com