రైల్వే ప్రయాణికులకు శుభవార్త
- October 03, 2017
రైలు ప్రయాణికులకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ మరో శుభవార్త అందించింది. ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌పై సర్వీస్ ఛార్జీలను వచ్చే ఏడాది మార్చి వరకు వసూలు చేయబోమని ప్రకటించింది. గత నవంబరులో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్ బుకింగ్స్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సర్వీస్ చార్జీలను ఎత్తివేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దీనిని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ ఏడాది జూన్ 30 వరకు సర్వీస్ ఛార్జీలను ఎత్తివేయగా దానిని సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. తాజాగా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
నోట్ల రద్దుకు ముందు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసే వారి నుంచి ఐఆర్‌సీటీసీ ఒక్కో టికెట్‌కు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేసేది. ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ ద్వారా ఐఆర్‌సీటీసీకి 33 శాతం ఆదాయం సమకూరుతున్నట్టు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు వచ్చిన రూ.1500 కోట్లలో రూ.540 కోట్లు సర్వీస్ ఛార్జీల ద్వారా వచ్చినవేనని ఆయన తెలిపారు. 2016 నవంబరు 23 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు ప్రయాణికుల నుంచి సేవా రుసుం, సేవా పన్ను రూపంలో రూ.184 కోట్లు వసూలు చేయకుండా వదిలేసినట్లు రైల్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







