వర్షాలు వరదల్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం
- October 03, 2017
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ ఇటీవల ఓ వర్క్ షాప్‌ని నిర్వహించింది. వర్షాలు, వరదల కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ వర్క్‌షాప్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో ఈ వర్క్‌షాప్‌ని నిర్వహించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ మరియు మెయిన్‌టెనెన్స్ - రియాద్ గవర్నరేట్ నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో, ఫ్లడ్ ఎమర్జన్సీ ప్లాన్, రియాద్‌లో వినియోగిస్తోన్న 'హజిర్' యాప్, మీడియాతో కలిసి పనిచేయడం, డిజాస్టర్స్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం వంటి అంశాల గురించి చర్చించారు. హజిర్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్నీ, అలాగే వరదలకు సంబంధించిన హెచ్చరికల్ని జారీ చేసి ప్రజల్ని అప్రమత్తం చేస్తారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో తలెత్తే సమస్యల్ని ఎదుర్కోవడంతోపాటుగా, బాధితులకు ఆహారం, మంచి నీరు అందించేందుకు పక్కా వ్యూహాల్ని ముందుగా సిద్ధం చేసేలా వర్క్‌షాప్‌లో చర్చించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







