పరుగుల రాణిగా ప్రియాంక చోప్రా
- October 04, 2017
ప్రస్తుతం భారతీయ సినీపరిశ్రమలో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. పర్ఫార్మెన్స్ పరంగా దర్శకులు, నటీనటులకి, పైసా వసూల్ పరంగా నిర్మాతలకి ఆ బయోపిక్స్ కలిసొస్తున్నాయి కూడా. నిజ జీవితంలోని పాత్రలని నిజంగా తెరకెక్కించడంలో దర్శకులు, ఆయా పాత్రల్లో నటించడంలో ఇంకెంతో నేర్చుకోవచ్చనే కారణంతో నటీనటులు ఈ సినిమాలు చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.తాజాగా అందుతున్న అప్డేట్స్ ప్రకారం ఫేమస్ అథ్లెట్, ఒలంపియన్ రియల్ స్టోరీ ఆధారంగా మరో బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లనుంది. దేశం గర్వించదగిన అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష యదార్థగాథ ఆధారంగా సౌతిండియాకు చెందిన ప్రముఖ ఫిలింమేకర్ రేవతి ఎస్ వర్మ ఓ బయోపిక్ సినిమాను తెరకెక్కించనున్నారు. జూన్ ఆర్(తమిళం), మ్యాడ్ డాడ్ (మళయాళం) చిత్రాలతో ఫేమస్ ఫిలింమేకర్‌గా పేరు తెచ్చుకున్న రేవతి ఎస్ వర్మ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు మ్యూజిక్ కోసం ప్రముఖ కంపోజర్ ఏ.ఆర్. రెహ్మాన్‌తో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లానింగ్ జరుగుతోంది.ఈ సినిమాలో పీటీ ఉష పాత్రలో ప్రియాంకా చోప్రా నటించనున్నట్టు సమాచారం. గతంలో ప్రముఖ రెజ్లర్ మేరీ కోమ్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమాలోనూ పింకీ చాప్స్ టైటిల్ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే, ఈ సినిమా కోసం పీటీ ఉషను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు రేవతి. ఈ బయోపిక్ కోసం ఆమెని ఎన్నిసార్లు కలిసినా.. ఆమె నుంచి మాత్రం ఇది సరైన సమయం కాదు అనే సమాధానమే వచ్చేది.ఇండియా నుంచి అథ్లెటిక్స్‌లో ఎవరో ఒకరు గోల్డ్ మెడల్ సాధించిన తర్వాతే బయోపిక్ గురించి ఆలోచిద్దామని పీటీ ఉష చెప్పేవారు. కానీ ఎలాగోలా అతికష్టమ్మీద ఆమెని ఒప్పించగలిగాను అని తన జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు రేవతి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







