'శివ' మేజిక్ మరోసారి రిపీట్ అవ్వనుంది
- October 04, 2017
అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో సినిమా అనగానే గుర్తొచ్చేది 'శివ'. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అయింది. ఈ సినిమాతో నాగార్జున క్రేజ్ కూడా రెట్టింపు అయింది. ఆ తరువాత వర్మ డైరెక్షన్ లో 'గోవింద గోవింద' అనే సినిమాలో నటించాడు నాగార్జున. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలుస్తోంది. నాగార్జునతో ఓ రియలిస్టిక్ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వర్మ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 'దాదాపు 28 ఏళ్ల తరువాత నాగార్జునతో కలిసి పని చేయబోతున్నాను. ఇప్పుడు చేసే సినిమా కూడా 'శివ' చిత్రంలా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. కానీ అందులో నిజం లేదు. ఇప్పటివరకు నేను, నాగార్జున కలిసి ఇలాంటి సినిమా చేయలేదు. శివ చిత్రంతో నాకు బ్రేక్ ఇచ్చిన నాగార్జునతో ఓ కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కించి ఆయనకు నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను' అని వెల్లడించాడు.
నాగార్జున కూడా ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. వర్మ చెప్పిన కథ బాగా ఎగ్జైట్ చేసిందనీ, కథలో కొన్ని మార్పులు చెప్పానని త్వరలోనే పూర్తి కథతో నా దగ్గరకి రాబోతున్నట్లు ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుతం నాగార్జున నటించిన 'రాజు గారి గది2' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







