హెచ్-1బీ వీసాల దరఖాస్తుల పరిశీలన పునఃప్రారంభం
- October 04, 2017
అన్ని రంగాలకు సంబంధించిన హెచ్–1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ (అధిక రుసుము తీసుకుని దరఖాస్తును వేగంగా పరిష్కరించడం)ను అమెరికా మంగళవారం పునఃప్రారంభించింది. ప్రీమియం ప్రాసెసింగ్‌కు దరఖాస్తులు ఎక్కువగా వస్తుండటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం విదితమే. సెప్టెంబర్‌లో కొన్ని రంగాల్లోని వీసాలకు మాత్రమే ప్రీమియం ప్రాసెసింగ్‌ను అనుమతించిన అగ్రరాజ్యం తాజాగా అన్ని రకాల హెచ్–1బీ వీసాలకు ఈ విధానంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రీమియం ప్రాసెసింగ్ కింద వచ్చిన హెచ్–1బీ దరఖాస్తులను అమెరికా 15 రోజుల్లో పరిష్కరిస్తుంది.
ఆలస్యమైతే దరఖాస్తుదారుడు సాధారణం కన్నా అధికంగా చెల్లించిన డబ్బును వెనక్కు ఇస్తుంది. కొన్ని ప్రత్యేక, సాంకేతిక నిపుణత అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలను అనుమతించేదే హెచ్–1బీ వీసా. భారత ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ వీసాపైనే అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెళ్తుంటారు. ఏడాదికి 65 వేల హెచ్–1బీ వీసాలను విదేశీయులకు, మరో 20 వేల హెచ్–1బీ వీసాలను అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఇతర దేశాల వారికి ఇవ్వాలనేది అమెరికా కాంగ్రెస్ నిబంధన. హెచ్–1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తూ అమెరికా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుతం ఈ విధానాన్ని సమీక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







