నవంబర్ 7న కమల్ పార్టీ ప్రారంభం!
- October 04, 2017
63వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్న తమిళ నటదిగ్గజం కమల్‌హాసన్.. తన పుట్టిన రోజైన నవంబర్ 7వ తేదీన నూతన పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన బుధవారం చెన్నైలో అభిమానులతో సమావేశమయ్యారు. పుట్టినరోజులోపు తన ప్రణాళికలకు తుదిరూపం ఇచ్చే విషయమై చర్చలు జరిపినట్టు సమాచారం. ఇంతకుముందు పలు ఇంటర్వ్యూల్లో వచ్చే ఏడాది జనవరి వరకు రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన కమల్.. చెన్నైలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాత్రం తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడున్న పార్టీలేవీ తన భావాలకు తగిన విధంగా లేవని ప్రకటించిన కమల్.. నూతనంగా పార్టీ ప్రారంభించేందుకే మొగ్గు చూపుతున్నారు.
కాగా చెన్నైలో జరిగిన అభిమానుల సమావేశంలో కేవలం పుట్టినరోజున చేపట్టే సేవా కార్యక్రమాల గురించి మాత్రమే చర్చించినట్లు కమల్‌హాసన్ వెల్ఫేర్‌క్లబ్ సీనియర్ సభ్యుడు తంగవేలు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







