జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లకు అల్లం నారాయణ కౌంటర్
- October 04, 2017
ఈ మధ్య ఏ సినిమా విడుదలైనా.. రివ్యూస్ మీదే చర్చ. సినిమా బావుంటే బావుందని లేదంటే లేదని ఖచ్చితంగా చెబుతున్నారు కొందరు రివ్యూవర్స్. దానికి సినిమా చూసి వస్తోన్న ఆడియన్స్ బైట్స్ ను కూడా యాడ్ చేస్తున్నారు. కానీ ఈ రివ్యూస్ మాత్రం సినిమా వారికి నచ్చడం లేదు. కంటెంట్ లేకున్నా కలెక్షన్లు వస్తున్నాయంటూ ప్రమోషన్స్ తో ఊదరగొడుతున్నవాళ్లు.. బాలేదని చెబితే మాత్రం తెగ ఇదైపోతున్నారు. రీసెంట్ గా జై లవకుశ సక్సస్ మీట్ లో ఎన్టీఆర్ రివ్యూవర్స్ ను ఏకంగా దారిన పొయ్యే దానయ్యలంటూ దారుణమైన కమెంట్స్ చేశాడు. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ దానిపై కమెంట్ చేసే హక్కుంటుందనే విషయం మాత్రం మర్చిపోతున్నారు వీళ్లు. ఎన్టీఆర్ మాత్రమే కాదు.. ఈ మధ్య సినిమావాళ్లలో చాలామంది రివ్యూస్ పై నెగెటివ్ కమెంట్స్ చేస్తున్నారు..
కానీ ఓ సినిమాను విశ్లేషించే హక్కు సినిమా జర్నలిస్ట్ లకు ఉంటుందని కుండబద్ధలు కొట్టారు తెలంగాణ మీడియా అకాడమీచైర్మన్ అల్లం నారాయణ. ఎవరైనా రివ్యూస్ వద్దంటున్నారంటే అది ఖచ్చితంగా మీడియా హక్కును శాసించినట్టే అవుతుందని చెప్పారు. అంతేకాదు..ఈ మాటల్లో ఎన్టీఆర్, మహేష్ బాబుల పేర్లు కూడా చెప్పి మరీ కౌంటర్ ఇచ్చాడు. మరి ఇకనైనా ఇండస్ట్రీ పెద్దలు రివ్యూస్ పడి ఏడవడం ఆపుతారేమో చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







