వేధింపులు తాళలేక నగ్నంగా రోడ్డుపైకి పరుగెత్తుకొచ్చిన మహిళ
- October 05, 2017
కువైట్ : బతుకు తెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్ళిన కొందరు ప్రవాస మహిళల జీవితాలు ఎంతో దుర్భరంగా మారుతున్నాయి. ఇథియోపియన్ దేశానికి చెందిన ఒక మహిళ గురువారం మధ్యాహ్నం స్థానిక జెలీబ్ అల్-షుయౌఖ్ వీధిలో వంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా పరుగులు పెట్టింది. ఆమెను అదుపులోనికి తీసుకొన్న అధికారులు ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేయడానికి మానసిక చికిత్స చేసే ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిశోధకులు ఆమెని ప్రశ్నించి విషయం రాబట్టేరు. ఆ మహిళ తెలిపిన వివరాల ప్రకారం, ఆమెని ఉద్యోగం కోసం తీసుకువచ్చిన ప్రాయోజికుడు ఒక అరబ్ ఉపాధ్యాయుడు కాగా ఆ నిందితుడు ...నిత్యం తన కామవాంఛలు తీర్చాలని వేధించడంతో తాను ఎంతో అలసిపోయినట్లు ఆమె పేర్కొంది. ఆ దుర్మార్గుడు దుస్తులు సైతం దాచిన నేపథ్యంలో ఆ అబల ఆ కామాంధుడి నుంచి తప్పించుకొనే యత్నంలో ఒక తీవ్రమైన మానసిక వత్తిడిలో వెర్రి వైఖరితో నగ్నంగా రోడ్లపై పరుగుపెట్టిందని మనోవిశ్లేషకులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







