‘జంధ్యాల రాసిన ప్రేమకథ’ మొదటి కాపీ సిద్ధం

- October 05, 2017 , by Maagulf
‘జంధ్యాల రాసిన ప్రేమకథ’ మొదటి కాపీ సిద్ధం

కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త నటినటులుగా తెరకెక్కింది ఈ చిత్రం. జంధ్యాల రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రం తొలి కాపీ రెడీ చేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమయ్యింది.  ఈ నెలాఖరుకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com