పాకిస్తాన్: ఆత్మాహుతి దాడిలో 18 మంది మృతి
- October 05, 2017
పాకిస్థాన్: ఆత్మాహుతి దాడిలో 18 మంది మృతిచెందారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఝల్ మగ్సీ మసీదు వద్ద జరుగుతున్న ఉర్సు వేడుకల్లో ఈ విషాదం నెలకొంది. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మసీదులోకి చొరబడేందుకు యత్నించిన దుండగుడిని అడ్డుకునే క్రమంలో పేలుడు సంభవించడంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందడంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా దాడికి పాల్పడింది తామేనని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. మసీదులను టార్గెట్ చేసే తాలిబన్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని సమాచారం.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







