1,000 కిలోల ఆహార పదార్ధాలు నాశనం చేసిన ఢోఫర్ మున్సిపాలిటీ
- October 06, 2017
మస్కట్ : ' కలిపి కొట్టరా...కావేటి రంగా ' అని మస్కట్ లో వ్యాపారులు మస్కా కొట్టలేరు.. వేపుళ్ళు మాటున కుళ్ళిన మాంసాలను అమ్మడం...వేడి వేడిగా పాడైన ఆహార పదార్ధాలను వినియోగదారులకు వడ్డించేయడం ఏ మాత్రం చెల్లదిక్కడ..తాజాగా ధోఫర్ మున్సిపాలిటీచే 1,000 కిలోగ్రాముల ఆహారధాన్యాలు నాశనం చేసింది. ఆ తర్వాత గవర్నరేట్ పరిధి లోని పలు దుకాణాలలో ఆకస్మికంగా పలు ఆహార పదార్ధాల తనిఖీ నిర్వహించింది. "ధోఫార్ మున్సిపాలిటీలో ఆహార నియంత్రణ శాఖ ఇన్స్ పెక్టర్ల సమన్వయంతో పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి మానవ వినియోగం కోసం ఏ మాత్రం పనికిరాని దాదాపు 1,236 కిలోల వివిధ ఆహార పదార్థాలు, అలాగే 3,615 లీటర్ల శీతల పానీయాలు, పాడైన పండ్ల రసాలను, కలుషితమైన తాగునీటిని నాశనం చేశారు. ఆయా ఉత్పత్తులకు సంబంధించిన సంస్థలకు తెలియచేసినట్లు ఆన్ లైన్ లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ధోఫర్ మున్సిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







