ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కుందన్ షా మృతి
- October 07, 2017
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కుందన్ షా మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కుందన్షా(69) తన నివాసంలో శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ‘‘జానే భి దో యారో’’ అనే చిత్రం ద్వారా వెండితెరపై తనదైన ముద్రవేసిన ఆయన ఆ తర్వాత అనేక మంచి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘‘జానే భి దో యారో’’ చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. 1984 లో దూరదర్శన్లో బాగా పాపులరైన కామెడీ సిరీస్ 'యహ్ జో హై జిందగీ' కు కుందన్ షా దర్వకత్వం వహించారు. కుందన్ షా మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కాగా దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులను నిరసినగా, అలాగే ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) విద్యార్థులకు మద్దతుగా 2015 నవంబర్లో 23 మంది దర్శకులతో కలిసి కుందన్ షా తన జాతీయ అవార్డును వెనక్కి పంపారు.
ఆయన దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు
క్యా కహెనా (2000)
హమ్ తో మొహబ్బత్ కరెగా (2000)
దిల్ హై తుమ్హారా (2002)
ఏక్ సె బడ్కే ఏక్ (2004)
పీ సే పీఎం తక్ (2014)
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







