చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తా అంటున్నమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

- October 07, 2017 , by Maagulf
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తా అంటున్నమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

మంత్రి తలసాని వెల్లడి 
ఆన్‌లైన్‌ టికెట్‌ పోర్టల్‌ ప్రారంభం 
ఆన్‌లైన్‌ సినిమా టికెట్‌ పోర్టల్‌ను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సచివాలయంలో శనివారం ప్రారంభించారు. దీంతో పాటు సినిమా షూటింగ్‌లకు వారం రోజుల్లో అనుమతులు ఇచ్చే ఏక గవాక్ష విధానాన్ని కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల మేరకు తెలంగాణ చలన చిత్ర పరిశ్రమాభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ విధానంతో టికెట్ల ధర విక్రయాలు ఎన్ని చేసిందనే విషయాలను పారదర్శకంగా సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు కోసం దీపావళి తర్వాత స్థలాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం భవిష్యత్‌లో అనేక కార్యక్రమాలు చేపడుతుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశామని, వివిధ విభాగాల్లో అవార్డు ఎంపిక కోసం ప్రభుత్వ సలహాదారు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు నియమించామని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్‌లలో మినీ థియేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు ఇస్తామని మంత్రి స్పష్టంచేశారు. ప్రపంచంలో తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాచాటిన 'బాహుబలి' మనదే కావడం ఎంతో గర్వకారణమని తలసాని అన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com