డెన్మార్క్ లో దారుణం ఓ బ్యాగులో ఈ జర్నలిస్టు తల, రెండు కాళ్లు దొరికాయ్
- October 07, 2017
అదృశ్యమైన స్వీడన్ మహిళా జర్నలిస్టు విగత జీవిగా కనిపించారు. అది కూడా కేవలం తల, కాళ్లు మాత్రమే ముక్కలుముక్కలుగా లభించాయి. ఈ విషయాన్ని డానిష్ పోలీసులు స్పష్టం చేశారు. సొంతంగా ఓ జలాంతర్గామిని తయారు చేసిన పీటర్ మాడ్సన్ను అదే జలాంతర్గామిలో ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన స్వీడన్‌కు చెందిన కిమ్ వాల్ అనే మహిళా జర్నలిస్టు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమెకోసం గాలిస్తున్న పోలీసులకు సముద్రంలో రెండు బ్యాగులు లభించాయి.
ఒక బ్యాగ్‌లో తల రెండు కాళ్లు ఉండగా మరో బ్యాగులో ఆమె దుస్తులు ఇతర వస్తువులు కనిపించాయి. విడి భాగాలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా అవి జర్నలిస్టు కిమ్ వాల్వేనని స్పష్టం చేశారు. తొలుత ఆగస్టు 21న తల లేని ఆమె మొండెం భాగం మాత్రమే కోపెన్ హాగన్లోని సముద్రంలో పోలీసులకు లభించగా మిగతా భాగాలను కూడా గాలించి చివరకు నిర్ధారించారు. ఈ హత్యలో పీటర్ మ్యాడ్సన్ను నిందితుడిగా చేర్చారు. కిమ్ వాల్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







