'సంజూ' బయోపిక్ కు టైటిల్ కంఫర్మ్
- October 07, 2017
రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా సంజయ్ దత్ బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారమ్. 'సంజూ' టైటిల్ ని ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. బాలీవుడ్ లో సంజయ్ దత్ ని సంజూ, సంజూ బాబా అని పిలుస్తుంటారు. ఇండస్ట్రీలో ఆ ఫీల్ ని తీసుకొచ్చేందుకు సంజయ్ దత్ బయోపిక్ కి సంజూ టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే, టైటిల్ విషయంలో చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
సినిమాలో పరేశ్ రావల్, మనీషా కోయిరాలలు సునిల్ దత్, నర్గీస్ పాత్రలను పోషించనున్నారు. సోనమ్ కపూర్, దియా మీర్జా, అనుష్కా శర్మలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. లీడ్ రోల్ పోషిస్తున్న రణ్ బీర్ సంజూ దత్ గెటప్ లో ఒదిరిపోయినట్టు కనబడుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







