సౌదీ రాయల్ ప్యాలెస్‌పై ఉగ్రదాడి...ఇద్దరు గార్డ్లు మృతి

- October 08, 2017 , by Maagulf
సౌదీ రాయల్ ప్యాలెస్‌పై ఉగ్రదాడి...ఇద్దరు గార్డ్లు మృతి

సౌదీ: ప్రపంచంలోనే అత్యంత పటిష్ట భద్రతను కలిగి ఉండే సౌదీ రాయల్ ప్యాలెస్‌పై ఉగ్రదాడి జరిగింది. అత్యాధునిక ఏకే 47 తుపాకితో, గ్రానేడ్లతో దాడికి దిగిన ఓ యువకుడు కాపలాగా ఉన్న ఇద్దరిని కాల్చి చంపాడని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని..వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. హ్యుందాయ్ కారులో దూసుకువచ్చిన ఆ వ్యక్తి..వచ్చి రావడంతోనే కాల్పులకు దిగాడని, భద్రతా దళాలు అప్రమత్తమయ్యే లోపు నష్టం జరిగిపోయిందని అయితే ఆ వెంటనే దుండగుడిని మట్టుబెట్టామని పేర్కొన్నారు. తాజా దాడితో జెడ్డాలో హైఅలర్ట్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com