బహ్రెయిన్ ప్రైమరీ స్కూల్ అడ్మిషన్: రిజిస్ట్రేషన్ ప్రారంభం
- October 08, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, 2018-19 సంవత్సరానికిగాను, ప్రైమరీ స్కూల్స్, అలాగే ప్రైమరీ ఇంటర్మీడియట్ స్కూల్స్‌లో అడ్మిషన్స్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఆదివారం అక్టోబర్ 8 నుండి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత స్కూల్ ప్రిన్స్పాల్స్కి ఈ మేరకు సర్కులర్ పంపడం జరిగింది. 2011 డిసెంబర్ - 2012లో జన్మించినవారు మాత్రమే రిజిస్ట్రేషన్‌కి అర్హులు. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్స్‌తో కలిసి స్టూడెంట్స్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఒరిజినల్ సిపిఆర్, వాటి కాపీలు, స్మార్ట్ కార్డ్స్‌కి సంబంధించిన ప్రింటెడ్ కాపీలు, గార్డియన్ తాలూకు స్మార్ట్ కార్డ్స్, కాపీలు రిజిస్ట్రేషన్ కోసం అవసరమవుతాయి. స్టూడెంట్‌కి సంబంధించిన ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్స్, మూడు ఫొటోలు కూడా తప్పనిసరి. అండర్-సిక్స్ స్టూడెంట్స్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీల్ని త్వరలో వెల్లడిస్తారు. ఆయా స్కూళ్ళలో ఖాళీల్ని బట్టి ఈ ఎంపికలు ఉంటాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది









