మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ చేతులమీదుగా టీఎస్‌పిఎల్ లోగో, జెర్సీల ఆవిష్కరణ

- October 09, 2017 , by Maagulf
మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ చేతులమీదుగా టీఎస్‌పిఎల్ లోగో, జెర్సీల ఆవిష్కరణ

గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ టాలెంట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన క్యాట్‌ ఆధ్వర్యంలో తెలంగాణ స్కూల్స్ ప్రీమియర్ లీగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. దేశంలోనే తొలిసారి ఏర్పాటైన ఈ లీగ్‌లో పాల్గొనే టీమ్ లోగో, జెర్సీలను భారత టీమ్ మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ ఆవిష్కరించారు. క్యాట్ ఫౌండర్ సునీల్‌బాబును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా 10 TSPL టీమ్ జెర్సీలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. తెలంగాణ నుంచి యువక్రికెటర్లను భారత జాతీయ జట్టుకు అందించడమే లక్ష్యంగా క్యాట్ పనిచేస్తుందని సునీల్‌బాబు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com