విదేశీ విరాళాలపై విచారణకు ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు దిల్లీ హైకోర్టు తెలిపింది
- October 09, 2017
రాజకీయ పార్టీల విదేశీ విరాళాలపై విచారణకు చివరి అవకాశంగా కేంద్రానికి ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు దిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ విషయంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 2014లో తాము ఇచ్చిన తీర్పును అమలుచేసేందుకు కేంద్ర హోం శాఖకు ఇస్తున్న చివరి అవకాశం ఇదేనని వ్యాఖ్యానించింది. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. బ్రిటన్ సంస్థ 'వేదాంత రిసోర్సెస్'కు చెందిన భారత విభాగం నుంచి రాజకీయ పార్టీలు నిధులు స్వీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మార్చి 25, 2014న ఎన్నికల సంఘం, హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. రాజకీయ పార్టీల ఖాతాలపై విచారణ చేపట్టి ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే కోర్టు తీర్పును అమలుచేసేందుకు గడువు కావాలని కోర్టును కేంద్ర హోం శాఖ పలుమార్లు కోరింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







