సినీ నటుడు మనోజ్ నందం కారు ధ్వంసం
- October 09, 2017
సినీనటుడు మనోజ్ నందం కారు ధ్వంసమైంది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నగరంలో భారీగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే... గచ్చిబౌలిలోని బీఎస్ఎన్ఎల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ ప్రహరీ గోడ పెద్ద శబ్ధంతో కూలిపోయింది. వర్షాలకు నానిపోయిన గోడ ఒక్కసారిగా కూలిపోగా ఆ సమయంలో గోడ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తోన్న ఓ మహిళపై ఇటుకలు, బండరాళ్లు మీద పడ్డాయి. దీంతో ఆమె సృహ కోల్పోయి కింద పడిపోగా స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అలాగే అదే ప్రహరీ గోడ పక్కన పార్కింగ్ రెండు కార్లపై కూడా శిథిలాలు పడడంతో కార్లు ధ్వంసమయ్యాయి. అంతేగాక అదే సమయంలో తన స్నేహితులతో కలిసి కారులో వస్తున్న సినీ నటుడు మనోజ్ నందం కారుపై కూడా పెద్దపెద్ద బండరాళ్లు పడడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఇదిలా ఉండగా పెద్దప్రమాదం తప్పిందంటూ మనోజ్ నందం సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







