రియల్ కధ ఆధారంగా సిద్ధార్థ్ 'గృహం'
- October 10, 2017
చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు సిద్ధార్థ్. ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో గృహం అనే చిత్రాన్ని ఆయన చేస్తున్నారు. మణిరత్నం శిష్యుడు మిళింద్ రావ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో సిద్దు సరసన ఆండ్రియా జెర్మియా, అతుల్ కుల్‌కర్ణి నటిస్తున్నారు. ఈ మూవీ నవంబర్‌లో విడుదలకానుంది.
అయితే నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని సిద్దు స్వయంగా వెల్లడించారు. మిళింద్‌కు, తనకు కామన్ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తి విషయంలో జరిగిన సంఘటనను తీసుకుని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. సినిమా సెట్స్‌పైకి తీసుకు రావడానికి ముందే అన్ని పర్మిషన్స్ తీసుకున్నట్టు సిద్దు తెలిపారు. సిద్ధార్థ్ సొంత నిర్మాణ సంస్థ ఎటకి ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని వయాకామ్ 18 పిక్చర్స్ సంస్థ సమర్పిస్తోంది.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







