కాలిఫోర్నియాలో అడవుల్లో వ్యాపించిన కార్చిచ్చు
- October 10, 2017
అమెరికాను కొంత కాలంగా ప్రకృతి వైపరీత్యాలు కుదిపేస్తున్నాయి. తాజాగా ఉత్తర కరోలినాలోని అడవుల్లో వ్యాపించిన కార్చిచ్చు.. 10 మందిని బలి తీసుకుంది. అడవులకు సమీపంలో నివస్తున్న 20 వేల మందిని... అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా.. కార్చిచ్చు మంటలకు సుమారు 15 వేల ఇళ్లు అగ్నికి ఆహుతయినట్లు అధికారులు ప్రకటించారు. అమెరికాలోని అడవుల్లో కార్చిచ్చు సహజంగా వ్యాపించినా.. ఇంత స్థాయిలో ఆస్తి నష్టం జరగడం ఇదే మొదటిసారని తెలిపారు.
ఉత్తర కరోలినాలో మొత్తం 94 వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం కార్చిచ్చు వందల ఎకరాల్లో ఉందని.. ఈ మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కరోలినా ఫారెస్ట్ అండ్ ఫైర్ ప్రొటక్షన్ డిప్యూటీ డైరెక్టర్ జానెట్ అప్టన్ తెలిపారు. ఆస్తి నష్టం మరింత ఎక్కువగా ఉండేందుకు అవకాశముందని ఆమె అన్నారు. అడవులకు సమీపంలోని నగరాలైన నాపా, నవేదా, ఆరెంజ్, సోనోమా, యాబాల్లో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







