ఎన్‌ఓఎల్‌ కార్డులు వినియోగిస్తే ఉచిత కూపన్స్‌

- October 11, 2017 , by Maagulf
ఎన్‌ఓఎల్‌ కార్డులు వినియోగిస్తే ఉచిత కూపన్స్‌

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ), లాయల్టీ పాయింట్స్‌ ప్రోగ్రామ్‌ని ఎన్‌ఓఎల్‌ కార్డుల కోసం ప్రారంభించనుంది. ఎన్‌ఓఎల్‌ ప్లస్‌ ప్రోగ్రామ్‌, ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఎన్‌ఓఎల్‌ కార్డుదారులు పాజిటివ్‌ పాయింట్స్‌ని రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఈ పాయింట్లు, కూపన్లు మరియు ఓచర్లుగా మార్చుకునేందుకు వీలుంది. కేఫ్‌లు, రెస్టారెంట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ సెటర్లలో వీటి ద్వారా ఫ్రీ సర్వీసెస్‌ పొందవచ్చు. ఆర్‌టిఎ కార్పొరేట్‌ టెక్నాలసీ సపోర్ట్‌ సర్వీసెస్‌ సెక్టార్‌ - ఆటోమేటెడ్‌ ఫేర్‌ కలెక్షన్‌ సిస్టమ్స్‌ డైరెక్టర్‌ ఖాలిద్‌ అల్‌ అవధి మాట్లాడుతూ, ఈ ఏడాది చివరి నుంచి ఈ ప్రోగ్రామ్‌ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. తొలిసారిగా ఎన్‌ఓఎల్‌ కార్డుదారులు లాయల్టీ పాయింట్స్‌ పొందేందుకు వీలుంటుందని వివరించారాయన. మెట్రో, పబ్లిక్‌ బస్‌లు, ట్రామ్‌, మెరైన్‌ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాల్ని, అలాగే పార్కింగ్‌ పేమెంట్‌ చేసేవారికి, ఎతిహాద్‌ మ్యూజియం, పబ్లిక్‌ పార్కుల్లో ఎన్‌ఓఎల్‌ కార్డులు వినియోగించేవారికి లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. వాటిని కూన్లుగా మలచుకుని ఫుడ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లలో వినియోగించుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com