గవర్నమెంట్ టీచర్లకు తీపికబురు.!
- October 11, 2017
కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు బంపర్ బొనాంజా తగిలింది. సుమారు 8 లక్షల మంది అధ్యాపకులకు 22 నుంచి 28 శాతం వేతనాలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 7వ వేతన సవరణ సంఘం సిపార్సులను ఆమోదించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. 7వ వేతన సవరణ సంఘం ఇచ్చిన సిఫార్సులపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పే కమిషన్ సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించినట్లు ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న యూనివర్సిటీ అధ్యాపకులకు, యూనియన్ గ్రాంట్స్ కమిషన్ పరిధిలో ఉన్న వర్సిటీలు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సాంకేతిక, ఇతర ఉన్న విద్యాలయాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, టీచర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ఆయన చెప్పారు.
7వ పే కమిషన్ అమల్లోకి రావడంతో నికర వేతనాలు సుమారు 20 శాతానికి పెరగనున్నాయి. ఇందులో సాధారణ పెరుగుతల 17 శాతం కాగా.. 2.57 శాతం ఫిట్‌మెంట్ అదనం. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపుదల కోసం సెప్టెంబర్ నెలలో మోదీ ప్రభుత్వం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో మొత్తం 22 మంది సభ్యులున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









