సౌదీ మహిళా డ్రైవర్లు జరీమానా చెల్లించాల్సిందే
- October 11, 2017
2018 జూన్‌కి ముందు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ సౌదీ మహిళా డ్రైవర్లు జరీమానా కట్టాల్సిందేనని ఓ మీడియా రిపోర్ట్చెబుతోంది. ఈ పెనాల్టీ ఫైన్స్ 133 డాలర్లు (499 సౌదీ రియాల్స్) మరియు 239 డాలర్లు (896 సౌదీ రియాల్స్) వరకు ఉంటుంది. అయితే ఆ మహిళలెవర్నీ అరెస్ట్ చేయలేదని ఆ రిపోర్ట్ వెల్లడించింది. మహిళా డ్రైవర్లపై బ్యాన్ ఎత్తివేయకముందు జరీమానాలు విధింపబడ్డవారికి మాత్రమే ఈ చెల్లింపు ఆదేశాలు వర్తిస్తాయట. మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగిన ప్రమాదాలకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ ఘటనలో 15 ఏళ్ళ బాలుడు, ఓ మహిళా డ్రైవర్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం వల్ల చనిపోతే, ఇంకో ఘటనలో ఓ మహిళ చనిపోగా, ఆమె భర్త తీవ్రగాయాల పాలయ్యారు. భర్త, ఆమెకు కారు నడపడం నేర్పుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా, సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్, సెప్టెంబర్‌లో మహిళలు కార్లను నడిపేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై సౌదీ అరేబియాలో నిషేధం అమల్లో ఉంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







