'చి ల సౌ'తో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్
- October 11, 2017
తేజ్ వీర్ నాయుడు సమర్పించు, సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజ కార్యక్రమాలు ఈ రోజు (బుధవారం)ప్రారంభం అయ్యింది. సుశాంత్ హీరోగా ప్రముఖ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. రుహాని శర్మ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతుంది. పీల గోవింద్ సత్యనారాయణ (అనకాపల్లి ఎం.ఎల్.ఏ) ముహూర్తం క్లాప్ కొట్టారు, అలాగే మలశాల దానమ్మ కెమెరా స్విచ్ ఆన్ చేసారు, తొలి షాట్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించడం జరిగింది.
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... "చాలా ప్యాషన్ తో ఉన్న నిర్మాతలతో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు, ఈయన మెంటల్ మదిలో, వెళ్లిపోమాకే సినిమాలకు పని చేశారు. అలాగే మా సినిమా ఎడిటర్ చోట కె ప్రసాద్ డీజే, ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలకు వర్క్ చేశారు. ఈ సినిమా ద్వారా కొత్త సుశాంత్ ని చూస్తారు అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ... "కథ బాగా నచ్చి చేస్తున్న సినిమా ఇది, రాహుల్ చాలా అద్భుతంగా ఈ చిత్రం తెరకెక్కిస్తాడాని నమ్మకం ఉంది. చాలా గ్యాప్ తరువాత మంచి లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది అన్నారు..మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ.. ఈ చిత్రం నా కెరీర్ కు చాలా హెల్ప్ అవుతుంది. రాహుల్ కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను అన్నారు.
ఈ చిత్రానికి నిర్మాతలు: భరత్ కుమార్ మాలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి, కెమెరామెన్: ఎం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ విహారి, ఎడిటర్: చోట కె ప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయిల గుండ్ల, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ, చీప్ కో డైరెక్టర్: డి. సాయి కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









