సౌదీ ఆయుధాల వినియోగంపై నిఘా పెట్టిన బ్రిటన్
- October 11, 2017
- ఐరాసలో బ్రిటన్ రాయబారి మ్యాథ్యూ రిక్రాఫ్ట్
సౌదీ అరేబియా ఆయుధాల వినియోగంపై నిఘా పెట్టినట్టు ఐరాసలో బ్రిటన్ రాయబారి మ్యాథ్యూ రిక్రాఫ్ట్ తెలిపారు. బ్రిటన్ నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను సౌదీ అరేబియా..ఉగ్ర సంస్థలకు సరఫరా చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో బ్రిటన్ రాయబారి పై విధంగా స్పందించారు. కాగా, యెమెన్‌లోని పౌర నివాసాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని సౌదీ సంకీర్ణదళాలు వైమానిక దాడులకు పాల్పడుతున్నాయి. సౌదీ సంకీర్ణదళాల దాడుల్లో ఎందరో అమాయకులు మృతి చెందారు. సౌదీ తీరుపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాకుండా, సౌదీకి ఆయుధాల సరఫరాను తక్షణమే నిలిపివేయాలని బ్రిటన్‌ను పౌర సంఘాలు అభ్యర్థిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం...2016లో సౌదీ సంకీర్ణదళాలు జరిపిన వైమానిక దాడుల్లో 683 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ఐరాస నివేదికను రిక్రాఫ్ట్ తప్పుపట్టారు.
సౌదీ అరేబియాకు బ్రిటన్ ఆయుధాలు సరఫరా చేయడంలో తప్పేమీ లేదని లండన్ కోర్టు తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ హక్కుల సంఘాల అభ్యర్థనను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు తీర్పు ప్రకారం..సౌదీ ఆయుధాల వినియోగాన్ని పర్యవేక్షిస్తు న్నామని అన్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







