సింగపూర్‌లో బాడీ మసాజ్‌లకూ రోబోలు!

- October 11, 2017 , by Maagulf
సింగపూర్‌లో బాడీ మసాజ్‌లకూ రోబోలు!

రోబోలతో ఉద్యోగాలు పోతాయంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే.. సింగపూర్‌లో ఇప్పుడు ఏకంగా మసాజ్‌లు చేసే రోబోలు వచ్చేశాయి..! ఎక్స్‌పర్ట్‌ మానిప్యులేటివ్‌ మసాజ్‌ ఆటోమేషన్‌ (ఎమ్మా) అని పిలుస్తున్న ఈ రోబోను నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఝాంగ్‌ అభివృద్ధి చేశారు. ఏడాది కిందే తొలి నమూనా తయారైనా మార్పులు, చేర్పులు చేసి మరింత మెరుగుపరిచేందుకు కొంత సమయం పట్టింది.

తాజాగా సోమవారం నుంచి ఈ రోబో సింగపూర్‌లోని నోవాహెల్త్‌ ట్రెడిషినల్‌ చైనీస్‌ మెడిసిన్‌ క్లినిక్‌లో మసాజ్‌లు చేయడం ప్రారంభించింది. శరీరంలోని టెండాన్లు, కండరాల పటుత్వాలను సెన్సర్ల ద్వారా గుర్తించి.. మసాజ్‌లు చేయడం వీటి ప్రత్యేకత. వెన్నెముక, మోకాళ్లకు మర్దన చేయడంలో మానవ మసాజర్లకు ఏమాత్రం తీసిపోదని ఝాంగ్‌ పేర్కొంటున్నారు. అయితే ఇది మనుషులకు ప్రత్యామ్నాయం కాదని.. ప్రస్తుతం క్లినిక్‌లలో మసాజ్‌లు చేస్తున్న వారిపై పని ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతోనే ఎమ్మాను తయారు చేశామని చెప్పారు. ఎక్కువ సమయం పట్టే మసాజ్‌ల విషయంలో మనిషికి బదులుగా రోబోను వాడతామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com