మా అమ్మే నా హీరో, నా రోల్ మోడల్ అంటున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా
- October 12, 2017బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రియాంక ఇన్‌స్టాగ్రాంలో తన తల్లి గురించి, ఆడపిల్లల గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఆడపిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లి కీలక పాత్ర వహిస్తుంది. ఈ రోజున నేనీ స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మ. మా అమ్మ చాలా పట్టుదలగల మనిషి. చాలా తెలివైంది. తను అనుకున్నది సాధించడం కోసం ఇల్లు వదిలి వెళ్లి పోయింది. మెడిసిన్‌కు సంబంధించి ఎనిమిది సర్టిఫికెట్లు అందుకుంది. ఆర్మీలో వైద్యురాలిగా పనిచేసింది. వైద్యురాలిగానే కాకుండా ఫైలట్‌గా కూడా సర్టిఫికెట్ తెచ్చుకుంది. తొమ్మిది భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. వీటన్నింటికీ మించి ఓ గొప్ప తల్లి, కుమార్తె, సోదరి, భార్య, వ్యాపార వేత్త కూడా. నా బలం, బలహీనత కూడా మా అమ్మే. అందుకే ఆమే నా హీరో అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం మూడు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ప్రియాంక.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ