'మాంజ' పాటల విడుదల కార్యక్రమం
- November 03, 2015
'మాంజ' పాటలొచ్చాయిచిన్న వయసులోనే 'ఫుట్పాత్' అనే చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మొత్తం 11 పురస్కారాల్ని అందుకొన్నాడు కిషన్.ఎస్.ఎస్. తాజాగా ఆయన కథానాయకుడుగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో 'మాంజ' చిత్రాన్ని తెరకెక్కించాడు. అవికాగోర్ కీలక పాత్రధారి. గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడి పల్లి నిర్మాతలు. వివేక్ కర్, మనోజ్ శ్రీహరి, కిషన్.ఎస్.ఎస్. సంగీతం సమకూర్చారు. హైదరాబాద్లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. తొలి సీడీని తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. దామోదర్ ప్రసాద్ స్వీకరించారు. ప్రచార చిత్రాలను ఎన్.శంకర్, రఘుకుంచె, సురేష్ కొండేటి విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ''కిషన్ త్వరలోనే ఓ అంతర్జాతీయ ప్రాజెక్టుని చేపట్టనున్నాడు. తను తీసిన 'మాంజ' ప్రచార చిత్రం, పాటలు బాగున్నాయి'' అన్నారు. కిషన్.ఎస్.ఎస్. మాట్లాడుతూ ''తెలిసీ తెలియని వయసులో అపరాధాలు చేసే వారి భావోద్వేగాలు, వీరి పట్ల చట్టం, సమాజం ధోరణి ఎలా ఉందన్న విషయాల్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యముంది. ఈ సినిమా ఈ నెల 6న లాస్ ఏంజిలెస్్లో అకాడెమీ అవార్డ్సు కమిటీ ముందు ప్రదర్శితం కానుంది. అవికా తన పాత్రలో ఒదిగిపోయింద''న్నారు. ఇలాంటి ప్రయోజనాత్మక సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పింది అవికా గోర్. తెలుగు, కన్నడ, హిందీల్లో ఈ నెల చివర్లో విడుదలవుతుందని గిరిధర్ చెప్పారు. కార్యక్రమంలో బాబా సెహగల్, ప్రసన్నకుమార్, రాజ్ కందుకూరి, ప్రతాని రామకృష్ణగౌడ్, వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







