బెంగళూరులో బారి వర్షాలు పూజారి గల్లంతు
- October 13, 2017
బెంగళూరుపై మళ్లీ వరుణుడు పంజా విసిరాడు. వర్ష బీభత్సంతో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలకు కాలువలు ఉప్పొంగాయి. కాలువలో పడి ముగ్గురు గల్లంతయ్యారు. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ప్రజలు భయభ్రాంతాలకు గురయ్యారు. బెంగళూరు ఎయిర్ పోర్టు రోడ్, హోసూర్ రోడ్, మల్లేశ్వరం, నృపతుంగ రోడ్, కస్తూరి బా రోడ్‌లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం పోలీసుల వల్ల కాలేదు.
భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీటిలో మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
భారీ వర్షాలకు గోడ కూలి నలుగురు చనిపోయారు. రాజా కాల్వలో పూజారి వాసుదేవ్ వర్షపు నీటిలో కొట్టుకుపోయారు. రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయాందోళనలు చెందుతున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







