ట్రంప్ ను పట్టిస్తే 10 మిలియన్ డాలర్ల నజరానా.!
- October 15, 2017
అమెరికా అడల్ట్ కథనాల సంచిక హస్ట్లర్ (లారీ ఫ్లైంట్) ఆదివారం ఓ బంపరాఫర్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవీచిత్యుడిని చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు తమకు ఇవ్వాలని ఓ ఆహ్వాన ప్రకటన వెలువరించింది. ఇందుకుగానూ 10 మిలియన్ డాలర్ల నజరాను అందజేస్తామని ది వాషింగ్టన్ పోస్ట్ సంచికలో ప్రకటన ఇచ్చింది.
74 ఏళ్ల లారీ క్లాక్స్‌టన్ ఫ్లైంట్ నేతృత్వంలో నడుస్తున్న ఈ అడల్ట్ సంచిక ఇంతకు ముందు కూడా ట్రంప్ పై ఇలాంటి ఆఫర్ నే ప్రకటించింది కూడా. గతేడాది అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై లైంగికపరమైన వివాదాలకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించి 1 మిలియన్ డాలర్లు గెలుచుకోవచ్చని ప్రకటించగా.. 2005లో ట్రంప్ చేసిన నీచమైన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ పేరిట ఓ ఫిక్షన్ పోర్న్ పేరడీ స్టోరీని హస్ట్లర్ సంచిక కొంత కాలం ప్రచురించింది కూడా. ఇక తాజాగా వారు విడుదల చేసిన ప్రకటనపై స్పందించేందుకు వైట్‌హౌజ్ ప్రతినిధులు నిరాకరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







