సాయిధరమ్ కొత్త సినిమా పోస్టర్ విడుదల
- October 15, 2017
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. 'జవాన్' చిత్రం తర్వాత సాయిధరమ్.. వి.వి. వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం టైటిల్‌ను ఖరారు చేయలేదు. సాయిధరమ్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఈ చిత్రం తొలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మెగా హీరో కుర్చీలో కూర్చొని, చేతిలో గన్ పెట్టుకుని డాన్‌లా కనిపించారు.
ఇదే సందర్భంగా మరో చిత్రం 'జవాన్'లోని తొలి పాటను విడుదల చేశారు. దీన్ని సాయిధరమ్ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సినిమాలోని అన్ని పాటల్లో ఇది తనకు చాలా ఇష్టమైనదని తెలిపారు. కేకే పవర్‌ఫుల్ సాహిత్యం అందించారని అన్నారు. తమన్ అద్భుతమైన స్వరాలు సమకూర్చారని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







