4 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్ ఫీజును తామే భరిస్తున్న దుబాయి డెవలపర్స్

- November 04, 2015 , by Maagulf
4 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్ ఫీజును తామే  భరిస్తున్న దుబాయి డెవలపర్స్

దుబాయి లోని డెవలపర్స్, నిర్మాణంలో ఉన్న తమ ప్రోజక్ట్  లకు వినియోగదారులను ఆకర్షించడం కోసం, వారు చెల్లించవలసిన 4 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును కుడా తామే భరిస్తున్నారు.అల్ ఫర్జాన్ లోని అనేక నివాస భవనాలను నిర్మించిన ప్రముఖ బిల్డర్ - అజిజి డెవలపర్స్ వారు, అల్ ఫర్జాన్ లోని తమ కొన్ని ప్రాజెక్టులకు కొనుగోలుదారులు చెల్లించవలసిన 4 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్ ఫీజును తామే చెల్లిస్తున్నారు. ఈ ఆఫర్ నవంబర్ మొదటి వరం వరకు ఉంటుందని కంపెనీ అధికారిక ప్రతినిధి తెలిపారు. ఇంకా పసిఫిక్ వెంచర్స్, గల్ఫ్ జనరల్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ , యునియన్ ప్రాపర్టీస్ వంటి మరికొన్ని సoస్థల వారు కుడా ఇంచుమించు ఇదే విధమైన ఆఫర్లతో వినియోగదారులకు గేలాలు వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com