బహ్రెయిన్ లో మాజీ భార్యపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు
- October 15, 2017
మనామ: ముహర్రాక్ గవర్నైట్ పరిధిలో మాజీ భార్య వాహనాన్ని తన కారుతో ఢీ కొట్టడమే కాక ఆమెపై చేయి చేసుకొన్న ఓ దూకుడు భర్తని పోలీసులు అరెస్టు చేశారు.బాధితురాలు ఈ దాడిపై స్థానిక ముహర్రక్ పోలీస్ స్టేషన్ లో తన మాజీ భర్తపై ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా కొట్టడంతో తానూ గాయపడినట్లు ఆ మహిళ ఆ ఫిర్యాదులో ఆరోపించింది. నిందితుడు తన కారుతో తన కారుని గుద్దించి తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు తెలిపింది . ముహర్రక్ గవర్నైట్ ప్రాసిక్యూషన్ ముఖ్యులు అబ్దుల్లా అల్ డోస్సారి ప్రాసిక్యూషన్ కేసు గురించి పోలీసు స్టేషన్ నుంచి తనకు వివరాలు అందినట్లు ఆయన ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. ఈ కేసులో తన దర్యాప్తును తక్షణమే ప్రారంభించినట్లు చెప్పారు. "బాధితురాలి యొక్క సాక్ష్యాన్ని వినడమే కాక ఆమెను బాధపెట్టిన మాజీ భర్త దుర్మార్గాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది . ఆమెకు ఏర్పడిన గాయాలు మరియు అందుకు కారణాలను గుర్తించేందుకు ఒక వైద్య పరీక్షను ఆమెకు జరిగించాలని ఆదేశించింది. విచారణ కొనసాగుతున్న సమయంలో నిందితుడు ప్రశ్నించబడ్డాడు మరియు పోలీసులచే నిర్బంధింపబడ్డాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







