సోషల్ మీడియాలో 'అదిరింది' జోరు

- October 15, 2017 , by Maagulf
సోషల్ మీడియాలో 'అదిరింది' జోరు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మూవీ టీజర్ లైక్స్ కౌంటర్ రికార్డు కొట్టిందని అంటున్నారు. ఈ హీరో కొత్త తమిళ మూవీ మెర్సల్ దీపావళి స్పెషల్ గా 18 న రిలీజవుతోంది. తెలుగులో " అదిరింది " టైటిల్ తో డబ్బింగ్ వెర్షన్ అదే రోజు విడుదలవుతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ టీజర్ కి ఇప్పటికే సుమారు 3 కోట్ల వరకు క్లిక్స్ వస్తే 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చినట్టు టాక్. కాజల్, సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ దర్శకుడు అట్లీ. ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటివరకు తెలుగులో సరైన సక్సెస్ లేని విజయ్ ఈ సినిమాలో మెజీషియన్ రోల్ చేస్తే.. తెలుగు వెర్షన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com