నవంబర్ 3న 'నెక్స్ట్ నువ్వే'
- October 15, 2017
ఆదిసాయికుమార్ హీరోగా, ప్రభాకర్.పి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి4 మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత బన్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైలర్ ఇటీవలే విడదలయ్యి మంచి స్పందన పొందుతుంది. హీలేరియస్ కామెడి థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైభవి, రష్మి లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ సూపర్బ్ గా అందించారు. సెన్సారు కార్యక్రమాలు పూర్తచేసుకుని నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ఏ సర్టిఫికేట్ తో విడులవుతుంది.
నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ.. వి4 మూవీస్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం1 గా తెరకెక్కిస్తున్న చిత్రం నెక్స్నువ్వే నవంబర్ 3 న విడుదల చేస్తున్నాం. ఈచిత్రంతో ప్రభాకర్.పి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మంచి కాన్సెప్ట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యటమే లక్ష్యం గా ఈ చిత్రాన్ని చేశాము. ఇటీవల ఆడియో విడుదలయ్యి మంచి విజయం సాధించింది. మా ఆడియో అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంశలు పొందుతుంది. "అరే భూగోళం ఎక్కడ చూసినా డబ్బుకు లోకం దాసోహం.. అది లేకుండా ఓ రోజైనా బ్రతకడమంటే మా కష్టం.. అరే ఈ పచ్చని నోటుకు ప్రాణం పోసినవాడసలెవ్వడురా.. న్యూటన్ ఫార్ములకన్నామించిన ఆకర్షణ ఈ నోటుదిరా..డబ్బే పరిగె్తే గుర్రం.. డబ్యే పదిలక్షల సైన్యం అబ్యో ఈ డబ్బులు ఇచ్చే కిక్కే వేరండోయ్.". అంటూ సాగే పాట ఈ నాటి విలువలు ఎలా వున్నాయో తెలియజేసేలా వుంటుంది. క్యాచి గా యూత్ అందరూ పాడుకునేలా వుంది. " ఆచి దోచి అచ్చినకరి దాచి ...ఆచి దోచి అచ్చినకరి దాచి " అని సాగే సాంగ్ చిన్న పిల్లల్ని ఆకట్టుకుంటుంది. అలాగే కొత్త సౌండింగ్ తో మా మ్యూజిక్ దర్శకుడు సాయికార్తిక్ చాలా కొత్త సౌండ్ ఇచ్చారు.. సినిమా ఫ్లాట్ తెలిసేలా చాలా బాగా అందిచారు. "అలా మేడ మీద ఎలా వాలేనమ్మా పదారేళ్ళ జాబిల్లే జానై.. మేఘంలా నేనే మారానా నిన్నే చేరనా..తాకే వానవనా..శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడనా...." అంటూ చక్కని మెలోడి అందరి హ్రుదయాల్లో స్థానం సంపాయించింది ఈ సాంగ్.. ఆడియో నే కాదు స్క్రీన్ మీద కూడా అందర్ని ఆకట్టకుంటుంది. ఈ సాంగ్ ని అవసరాల శ్రీనివాస్ మరియు హిమజ మీద చిత్రీకరించాము.. చిత్రంలో ఈసాంగ్ చాలా ఇంపార్టెంట్ వుంటుంది. అలాగే ఈ చిత్రంలో హీరో ఆదిసాయికుమార్ పాత్ర చాలా బాగుంటుంది. ఆదిసాయికుమార్ కెరీర్ లో ఇది మంచి విజయం గా నిలుస్తుంది. వైభవి, రష్మి, అవసరాల శ్రీనివాస్, బ్రహ్మజి, రఘు మంచి పాత్రల్ల కనిపిస్తారు. సెన్నారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఏ సర్టిఫికేట్ తో ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3న విడుదలవుతుంది. హర్రర్ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రం తెరకెక్కింది అని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







