మళ్ళీ ఆ తప్పు చేయద్దంటున్న నివేదా థామస్

- October 15, 2017 , by Maagulf
మళ్ళీ ఆ తప్పు చేయద్దంటున్న నివేదా థామస్

నివేదా థామస్ అంటే కుర్రకారుకు అదో కిక్కు. ఈ ముద్దుగుమ్మ పేరు చెబితేనే ఖుషీ అయిపోతారు. ఇక పోస్టర్ చూస్తే.. ఫుల్లు హ్యాపీస్. అందులోనూ అమ్మడి పుట్టినరోజంటే.. కుర్రకారుకు పండగరోజే. అందుకే  వాళ్లంతా... ఫుల్ స్పీడులో ఉన్న నివేదా బర్త్ డే ఎప్పుడా అని చూస్తే.. అక్టోబర్ 15 అని గూగుల్ లో కనిపించింది. ఇంకేముంది... వరుసపెట్టి విషెష్ చెప్పేశారు. అలా ఇలా కాదు.. సోషల్ మీడియాలో ఆమె గురించి పోస్టుల మీద పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో ఉక్కిరిబిక్కిరైన నివేదాకు.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే.. ఆమె బర్త్ డే అక్టోబర్ 15న కాదు. దీంతో తనపై ఇంత అభిమానం చూపించిన ఫ్యాన్స్ ను ఏమీ అనలేక.. వారి విషెష్ ను కాదనలేక.. ఓ ట్వీట్ ద్వారా అసలు స్టోరీ చెప్పింది. అక్టోబర్ 15న తన బర్త్ డే కాదని.. నవంబర్ 2న తన పుట్టినరోజని క్లారిటీ ఇచ్చింది. అంత టైం కేటాయించి మరీ తనకు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది. కాకపోతే ఇదంతా గత ఏడాది జరిగింది. ఈసారి కూడా అలాంటి పొరపాటే జరుగుతుందని తన బర్త్ డే అక్టోబర్ 15న కాదని ట్విట్టర్ లో ముందుగానే గుర్తుచేయాల్సి  వచ్చింది. సో నివేదా ఫ్యాన్స్.. అమ్మడి బర్త్ డే.. నవంబర్ 2. ఈ విషయాన్ని గూగుల్ లో కరెక్ట్ చేస్తే ఏ సమస్యా ఉండదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com