కువైట్‌ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ యత్నం భగ్నం

- October 15, 2017 , by Maagulf
కువైట్‌  డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ యత్నం భగ్నం

కువైట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పర్సనల్‌ ఆరుగురు సభ్యుల డ్రగ్స్‌ ముఠాని అరెస్ట్‌ చేసింది. వారి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్‌స యాంఫిటమైన్‌ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. 2 మిలియన్లకు పైగా కాప్టగాన్‌ పిల్స్‌ని స్మగ్లింగ్‌ చేసే యత్నాన్ని భగ్నం చేయడం జరిగిందని మినిస్ట్రీకి చెందిన ఇన్ఫర్మేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. యాంటీ నార్కోటిక్స్‌ జనరల్‌ డైరెక్టరేట్‌, ఈ స్మగ్లింగ్‌ యత్నాన్ని భగ్నం చేసినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. వివిధ దేశాలకు చెందినవారి సహకారంతో ఓ వ్యక్తి విమానయానం ద్వారా డ్రగ్స్‌ని స్మగుల్‌ చేస్తున్నట్లు సమాచారం అందడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఆ యత్నాన్ని భగ్నం చేయడం జరిగింది. విచారణలో నిందితుడు మరో స్మగ్లింగ్‌ యత్నం గురించి సమాచారం అందించడంతో, ఇద్దరు సిటిజన్స్‌ని అరెస్ట్‌ చేశారు. ఇందులో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నట్లు తెలియవస్తోంది. 300 కాప్టగాన్‌ పిల్స్‌ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com