బెంగళూరులో సిలిండర్ పేలి..ముగ్గురు మృతి..కూలిన నాలుగు ఇళ్లు..శిధిలాల కింద 50 మంది
- October 16, 2017
బెంగళూరులో సిలిండర్ పేలుడు ప్రకంపనలు సృష్టించింది. ఎజ్జిపుర ప్రాంతంలో భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. ఆ ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. అందులో ఉన్న వారంతా శిథిలాల కింద చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే బెంగళూరు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.
భారీ శబ్దంలో పేలుడు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వైపు పేలుడు.. మరోవైపు వెంటనే భవనాలు కూలిన శబ్దం రావడంతో ప్రజలు హడలెత్తిపోయారు. చుట్టుపక్కల వారు పరుగున వచ్చి. వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో శిథిలాల కింద నుంచి హాహాకారాలు వినిపించాయి. వెంటనే స్థానికులు మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సిలిండర్ పేలుడు ఇంత భయంకరంగా ఉంటుందని అక్కడి వారు ఊహించలేకపోతున్నారు. శిథిలాల కింద కనీసం మరో 50 మంది ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. వారందరినీ బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







