నాగార్జున, రాం గోపాల్ వర్మ కలిసి త్వరలో సినిమా
- October 16, 2017
నాగార్జున, రాం గోపాల్ వర్మ కలిసి త్వరలో సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి కలయికలో 1989లో వచ్చిన శివ సినిమా ఒక సంచలనం, ఒక చరిత్ర. తెలుగు సినిమా చరిత్రను శివ ఒక మలుపు తిప్పింది. శివ తర్వాత సినిమా ట్రెండ్ మారిపోయింది. ఆ తర్వాత నాగార్జున, వర్మ కాంబినేషన్ అంతం, గోవిందా గోవిందా సినిమాలు చేశారు.
ఇప్పుడు మరోసారి వీరు జతకడుతున్నారు. ఇటీవల నాగ్ని కలసి స్టోరీ ఐడియా చెప్పడం, నాగ్ వెంటనే ఇంప్రెస్ అయిపోవడం జరిగిపోయాయి. "శివ కథ విన్న తరవాత ఎంత ఉత్సాహంగా అనిపించిందో.. ఇప్పుడు వర్మ కథ చెప్పినప్పుడు కూడా అంతే థ్రిల్ ఫీలయ్యా" అంటున్నాడు నాగ్ఈ సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రియలిస్టిక్ సినిమాల్ని తీయడంలోవర్మ దిట్ట. ఈసారీ అలాంటి కథే తీసుకొన్నాడని టాక్.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









